Laahe laahe Song Lyrics from Aacharya Movie, For this song Lyricist Ramajogayya Sastry. Singers are Sahiti Chaganti, Harika Narayan, and Music composed by Mani Sharma. Chiranjeevi, Kajal Aggarwal, Ram Charan, and Pooja Hegde are playing lead roles.
Laahe laahe Song Lyrics
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
కొండలరాజు బంగరు కొండ కొండా జాతికి అండా దండా
మద్దే రాతిరి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే
ఆటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
మెళ్ళో మెలికల నాగుల దండ
వలపుల వేడికి ఎగిరి పడంగా
ఒంటి యిబూది జలజల రాలి పడంగా
సాంబడు కదిలిండే
అమ్మ పిలుపుకు సామి
అత్తరు సెగలై విల విల నలిగిండే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
నరదిన దినదిన నాననా
నరదిన దినదిన నాననా
కొరకొర కొరువులు మండే కళ్ళు
జడలిరబోసిన సింపిరి కురులు
ఎర్రటి కోపాలెగసిన కుంకంబొట్టు వెన్నెల కాసిందే
పెనిమిటి రాకను తెలిసి సీమాతంగి సిగ్గులు పూసిందే
ఉబలాటంగా ముందటికురికి అయ్యవతారం చూసిన కల్కి
ఎందా శంఖం సూళం భైరాగేసం ఏందని సనిగిందే
ఇంపుగ ఈ పూటైనా రాలేవా అని సనువుగ కసిరిందే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
లోకాలేలే ఎంతోడైన లోకువమడిసే సొంతింట్లోన
అమ్మోరు గడ్డంపట్టి బతిమాలినవి అడ్డాల నామాలు
ఆలుమొగల నడుమన అడ్డం రావులే ఎట్టాంటి నిమాలు
ఒకటో జామున కలిగిన విరహం
రెండో జాముకి ముదిరిన విరసం
సర్దుకుపోయే సరసం కుదిరే వేళకు
మూడో జామాయే
ఒద్దిక పెరిగే నాలుగో జాముకి
గుళ్లో గంటలు మొదలాయే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
ప్రతి ఒక రోజిది జరిగే ఘట్టం
ఎడమొకమయ్యి ఏకం అవటం
అనాది అలవాటీళ్ళకి అలకలలోనే కిలకిలమనుకోటం
స్వయాన చెబుతున్నారు అనుబంధాలు
కడతేరే పాఠం
Also, read: Bangaara Song Lyrics – Bangarraju Movie